కలం స్పోర్ట్స్: పాకిస్థాన్ జట్టులోకి ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ (Shadab Khan) రీఎంట్రీకి ఇచ్చాడు. శ్రీలంకతో అతి త్వరలో జరగనున్న టీ20 స్క్వాడ్‌లో షాదాబ్ ఎంట్రీతో జట్టు రీఫ్రెష్ యింది. శ్రీలంకతో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. సల్మాన్ అలీ ఆఘా కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. వికెట్‌కీపర్-బ్యాటర్ ఖ్వాజా మొహమ్మద్ నఫాయ్ జాతీయ టీ20 జట్టుకు తొలిసారిగా ఎంపికయ్యాడు.
జట్టులో ఫఖర్ జమాన్, నసీమ్ షా, ఫహీమ్ అష్రఫ్, అబ్రార్ అహ్మద్, మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ వసీమ్ జూనియర్ తదితరులు చోటు దక్కించుకున్నారు. బిగ్ బాష్ లీగ్‌లో (Big Bash League) పాల్గొంటున్న షాహీన్ అఫ్రిది, బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్, హసన్ అలీకి ఈసారి అవకాశం దక్కలేదు. భుజం గాయంతో విరామంలో ఉన్న షాదాబ్ ఖాన్‌ను (Shadab Khan) జట్టు ఆల్‌రౌండ్ బలాన్ని పెంచేందుకు మళ్లీ ఎంపిక చేశారు. పాకిస్తాన్ జట్టు జనవరి 4 మరియు 5 తేదీల్లో శ్రీలంకకు బయలుదేరనుంది. ఈ టీ20 సిరీస్ జనవరి 7, 9, 11 తేదీల్లో డంబుల్లాలో జరుగనుంది.
Read Also: ఒంటిచేత్తో కోటి రూపాయలు ‘పట్టేశాడు’!
Follow Us On: Youtube


