కలం, వెబ్ డెస్క్ : రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నీటిపారుదల శాఖపై కీలక సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. నీటి వాటాలు, ఏపీతో ఉన్న వివాదాలు, ప్రస్తుతం ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, ఇతర కేటాయింపులపై ఇందులో చర్చించారు. రీసెంట్ గా నీటి కేటాయింపులపై జరిగిన పరిణామాలు, తీసుకున్న నిర్ణయాలు, అసెంబ్లీ వీటిపై చర్చించాల్సిన అంశాలు, ప్రభుత్వ సమాధానాలపై కీలక చర్చలు జరిపారు సీఎం రేవంత్ రెడ్డి.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని విషయాలపై నివేదికలు తెప్పించుకుని సిద్ధంగా ఉండాలని సూచించినట్టు తెలుస్తోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా ఈ నదీ జలాల వాటాల మీదనే చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే రేవంత్ (Revanth Reddy) ముందే కీలక సమాచారం సేకరిస్తున్నట్టు తెలుస్తోంది.
Read Also: లంకపై భారత్ జైత్రయాత్ర: నాలుగో టీ20లోనూ ఘనవిజయం
Follow Us On: Sharechat


