epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఒంటిచేత్తో కోటి రూపాయలు ‘పట్టేశాడు’!

కలం, వెబ్​డెస్క్​: లక్​ అంటే అతనిదే. మ్యాచ్​ చూడ్డానికి వెళ్లి.. ఒకటీ రెండూ కాదు ఏకంగా కోటి రూపాయలను ఒంటిచేత్తో పట్టేశాడు (Fan wins one crore). సదరు లక్కీ పర్సన్​కు ఈ లక్కీయెస్ట్​ ఇన్సిడెంట్​ సౌతాఫ్రికా టీ20 లీగ్​ ఎస్​ఏ20లో (SA20) జరిగింది. ఈ సీజన్​ మొదటి మ్యాచ్​ శనివారం దక్షిణాఫ్రికాలోని కేప్​టౌన్​లో డర్బన్స్​ సూపర్​ జెయింట్స్​, ఎంఐ కేప్​టౌన్​ మధ్య జరిగింది. ఇందులో కేప్​టౌన్​ ఇన్నింగ్స్​ జరుగుతుండగా, ఆ జట్టు ఆటగాడు రియాన్​ రికెల్టన్​ కొట్టిన ఓ బంతి ప్రేక్షకుల గ్యాలరీలోకి దూసుకొచ్చింది. అక్కడే స్నేహితులతో కలసి మ్యాచ్ చూస్తున్న ఓ వ్యక్తి వెంటనే పైకి లేచి క్యాచ్​ కోసం ఎడమ చేయి చాచాడు. అంతే, ఆ బంతి నేరుగా అతని చేతిలో పడింది. దీంతో ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేకపోయాయి. కాగా, మ్యాచ్​లో ఎవరైనా ఒంటి చేత్తో క్యాచ్​ పడితే బెట్​వే సంస్థ 2 మిలియన్ల సౌతాఫ్రికా డాలర్లు ఇస్తుంది. ఇది ప్రస్తుతం మన భారత కరెన్సీలో రూ.1కోటీ 7లక్షలకు సమానం. అయితే, దీని కోసం కొన్ని నియమాలు ఉన్నాయి. క్యాచ్​ను కేవలం ఒంటిచేత్తోనే పట్టాలి. శరీరంలోని ఇతర భాగాల (భుజం, ఛాతీ) తోపాటు డ్రస్​, టోపీ వంటివి తగలకూడదు. 18 ఏళ్లు నిండిన వ్యక్తి మాత్రమే అర్హులు. ఇప్పటి వరకు ఇలా ముగ్గురు మాత్రమే కోటి రూపాయలు గెల్చుకున్నారు.

కాగా, పరుగుల వరద పారిన ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​ చేసిన డర్బన్​ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. డెవాన్​ కాన్వే(64; 33 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్​లు) చేయగా, కేన్​ విలియమ్సన్​(40)తోపాటు బట్లర్​(20), క్లాసెన్​(22), మార్క్​రమ్​(35), జోన్స్​(33) తలో చేయి వేశారు. అనంతరం ఛేదనలో కేప్​టౌన్​ కెప్టెన్​, ముంబై ఇండియన్స్​ ఆటగాడు రికెల్టన్(113; 63 బంతుల్లో 5 ఫోర్లు, 11 సిక్స్​లు) విరుచుకుపడినప్పటికీ, జేసన్​ స్మిత్​(41; 14 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్​లు) మినహా మిగిలినవాళ్లు రాణించడంతో ఆ జట్టు 15 పరుగుల తేడాతో ఓడింది. తమ జట్టు ఓడినప్పటికీ తను కొట్టిన సిక్స్​తో ఓ ప్రేక్షకుడికి మరచిపోలేని ఆనందం ఇచ్చాడు రికెల్టన్​.

Read Also: యాంకర్ సుమ కామెంట్లపై వివాదం..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>