epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

‘జయా ఆంటీ మాలూమ్ తేరా కో’.. అంటే కుదరదంటోన్న సజ్జనార్

కలం, వెబ్​ డెస్క్​ : ‘జయా ఆంటీ మాలుమ్​ తేరా కో.. లల్లు అంకుల్​ మాలుమ్​ తెరకో’ అంటే కుదరదని సజ్జనార్​ (CP Sajjanar) మందుబాబులకు వార్నింగ్​ ఇచ్చారు. సాధారణంగా పోలీసుల తనిఖీల్లో పట్టుబడినప్పుడు కొందరు యువకులు అతిగా రియాక్ట్​ అవుతుంటారు. మా నాన్న ఎవరో తెలుసా? మా అంకుల్​ ఎవరో తెలుసా? అంటూ పోలీస్ అధికారులతో వాగ్వివాదానికి దిగుతుంటారు. వాళ్ల పేరు చెప్పుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు.

మరీ ముఖ్యంగా డ్రంక్​ డ్రైవ్​ (Drunk and Drive) లో పట్టుబడ్డప్పుడు యువకులు వాళ్లు తెలుసా.. వీళ్లు తెలుసా? అంటూ పోలీసుల అధికాకరులపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి వాటిపై హైదరాబాద్​ సజ్జనార్​​ తనదైన రీతిలో స్పందించారు. నూతన సంవత్సరం వేళ మందు బాబులకు ఆయన ఎక్స్​ వేదికగా వార్నింగ్ ఇచ్చారు. డ్రంక్​ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే ఊరుకోబమని హెచ్చరించారు. తాగి వాహనాలు నడుపుతూ దొరికిపోయిన వారు మా నాన్న తెలుసా.. మా అంకుల్​ తెలుసా.. అన్న తెలుసా అంటూ తమ అధికారుల దగ్గర మాట్లాడొద్దని సజ్జనార్​ సూచించారు.

‘మా డాడి ఎవరో తెలుసా.. మా అంకుల్​ ఎవరో తెలుసా.. అన్న ఎవరో తెలుసా అని మా ఆఫీసర్లను అడగొద్దు. మేము మీ ప్రైవసీకి రెస్పెక్ట్​ ఇస్తాము. వెహికిల్ పక్కకు పెట్టి, మళ్లీ డేట్ వచ్చిన రోజు కోర్టులో పరిచయం చేసుకుందాం’ అని సజ్జనార్​ (CP Sajjanar)​ ట్వీట్​ లో రాసుకొచ్చారు.

Read Also: హైదరాబాద్ పబ్బుల్లో ఈగల్ టీమ్ తనిఖీలు..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>