epaper
Monday, March 2, 2026
epaper

బంగ్లాదేశ్‌లో అరాచకాలపై తీవ్రంగా స్పందించిన మాజీ సీఎం

కలం, వెబ్​ డెస్క్​ : బంగ్లాదేశ్‌లో (Bangladesh) హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులు, అరాచకాలపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి ఎంపీ బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అక్కడ శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మైనారిటీల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం తన ప్రజలపై, అలాగే దేశంలోని శాంతిభద్రతలపై పూర్తి నియంత్రణను కోల్పోయిందని బొమ్మై విమర్శించారు. అక్కడ మైనారిటీలు ఏమాత్రం సురక్షితంగా లేరని ఆయన స్పష్టం చేశారు.

హిందువులపై దాడులకు పాల్పడుతున్న వారిని వెంటనే గుర్తించి, అరెస్టు చేయాలని బసవరాజు బొమ్మై(Basavaraj Bommai) డిమాండ్ చేశారు. హిందూ కుటుంబాలకు, వారి ఆస్తులకు, దేవాలయాల వంటి ధార్మిక సంస్థలకు తక్షణమే పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని కోరారు. ఈ హింసాకాండ ఇలాగే కొనసాగితే, అది కేవలం బంగ్లాదేశ్‌కే పరిమితం కాకుండా మొత్తం ఆగ్నేయాసియా (Southeast Asia) ప్రాంతం యొక్క సుస్థిరతను దెబ్బతీస్తుందని ఆయన హెచ్చరించారు. ‘పరిస్థితిని అదుపు చేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’ అని హెచ్చరించారు.

Read Also: దైవదూషణ కాదు.. అసూయతో దీపు దాస్​ను చంపేశారు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!