కలం వెబ్ డెస్క్ : రాష్ట్రంలో ఉద్యోగాలు చేసుకునే వారి నుంచి ఉపాధికూలీకి వెళ్లే సామాన్య ప్రజలకు అందరినీ భయపెట్టేలా చంద్రబాబు (Chandrababu) పరిపాలిస్తున్నాడని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) విమర్శించారు. ఆదివారం నాని మీడియా సమావేశంలో మాట్లాడారు. రేపు తమ జీవితం ఎలా ఉంటుందోనని ఏపీ ప్రజలంతా భయంతో బతుకుతున్నారన్నారు. వైయస్ జగన్ ఎంతో దూరదృష్టితో 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించి 4 పూర్తి చేశారన్నారు. సీఎం చంద్రబాబు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో వైద్య రంగాన్ని ప్రైవేటు పరం చేయాలనే విపరీతంగా ప్రయత్నిస్తున్నాడన్నారు. చంద్రబాబు పీపీపీ(PPP)నే పట్టుకొని పదే పదే అదే ధ్యాసగా ఉన్నారన్నారు.
రాష్ట్రంలో చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్(Lokesh), పవన్ కల్యాణ్(Pawan Kalyan) తప్ప ఎవరూ బాగుపడలేదని వ్యాఖ్యానించారు. ఎందుకు వీళ్లను గెలిపించామని టీడీపీ(TDP) కార్యకర్తలు బాధపడే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. పీపీపీ వల్ల ఎవరు బాగుపడ్డారని, ప్రజలకు ఏం లాభమని ప్రశ్నించారు. పీపీపీ వల్ల ప్రజలకు జరిగి ఉపయోగం ఏంటో సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. సీఎం చంద్రబాబు పీపీపీ కింద ముఖ్యమంత్రి పదవి కూడా డబ్బున్న వారికి నాని(Perni Nani) ఇచ్చేయాలన్నారు.
Read Also: బాల రాముడిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
Follow Us On: Pinterest


