epaper
Monday, March 2, 2026
epaper

నాగం వర్షిత్ రెడ్డిపై బీజేపీ అధిష్ఠానం సీరియస్‌

కలం, వెబ్ డెస్క్: నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిపై (Nagam Varshit Reddy) పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. ఇటీవల నల్లగొండ (Nalgonda) బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మరో బీజేపీ నేత పిల్లిరామరాజు యాదవ్‌పై నాగం వర్షిత్ రెడ్డి అనుచరులు దాడి చేసిన విషయం తెలిసిందే. నాగం వర్షిత్ రెడ్డి ఆదేశాలతోనే ఈ దాడి జరిగిందని ఆరోపిస్తూ పిల్లిరామరాజు యాదవ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుకు ఫిర్యాదు చేశారు.

నాగం వర్షిత్ రెడ్డి తీరుపై బీసీ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పార్టీ కార్యాలయంలో బీసీ నేతపై దాడి జరగడంపై బీజేపీ పెద్దలు కాస్త అసహనంగా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నాగం వర్షిత్ రెడ్డిని అధిష్టానం మందలించినట్టు తెలుస్తోంది.

నాగం వర్షిత్ రెడ్డిని (Nagam Varshit Reddy) జిల్లా అధ్యక్ష పదవి నుంచి వెంటనే తొలగించాలని బీజేపీ క్యాడర్ నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ అంతర్గత క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో వర్షిత్ రెడ్డిపై చర్యలకు అధిష్టానం సిద్ధమవుతున్నట్టు సమాచారం.

Read Also: సిగాచీ కంపెనీ దుర్ఘ‌ట‌న కేసు.. సీఈవో అరెస్ట్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!