epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఆపరేషన్​ ఆఘాట్​ 3.0.. ఢిల్లీలో భారీగా అరెస్టులు

కలం, వెబ్ డెస్క్​ : దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్​ ఆఘాట్ 3.0 (Operation Aghat 3.0) లో భాగంగా నూతన సంవత్సర వేడుకలకు ముందు నిర్వహించిన స్పెషల్​ ఆపరేషన్​లో పోలీసులు 331 మందిపై కేసు నమోదు చేశారు. అలాగే, ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యం, వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్​ వేడుకల సందర్భంగా వీధి నేరాలు, నేరస్తుల కార్యకలాపాలను అరికట్టడానికి శనివారం ఆగ్నేయ ఢిల్లీలో 600 మంది పోలీసులు ఈ ఆపరేషన్​ నిర్వహించారు.

Operation Aghat 3.0 లో ఢిల్లీ ఎక్సైజ్​ యాక్ట్​, ఎన్డీపీసీ యాక్ట్​, పబ్లిక్ గ్యాంబ్లింగ్​ చట్టం కింద 331 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే వివిధ నిబంధనల కింద 504 మందిని అరెస్ట్​ చేశారు. చెడు ప్రవర్తన కలిగిన 116 మందిని, ఐదుగురు ఆటోలిఫ్టర్లను, నలుగురు నేరస్తులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ పోలీస్​ యాక్ట్​ ప్రకారం 1306 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గరి నుంచి 21 పిస్టోల్స్​, 20 బుల్లెట్లు, 27 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. 12,258 అక్రమ మద్యం బాటీళ్లు, 6.01 కిలోల గంజాయి, జూదగాళ్ల నుంచి రూ.2.36 లక్షల నగదు, 310 ఫోన్లు, ఆరు బైకులు, కార్లు స్వాధీనం చేసుకున్నారు.

Read Also: కేంద్రంలో వన్ మ్యాన్ షో నడుస్తోంది: రాహుల్ గాంధీ

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>