కలం, వెబ్ డెస్క్: దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లండ్ (England) తమ తొలి టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది. యాషెస్‌లీగ్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ (England) టెస్ట్ సిరీస్ ఆడుతున్నాయి. వీటిలో ఇప్పటికే వరుసగా తొలి మూడు మ్యాచ్‌లలో ఇంగ్లండ్ చిత్తయింది. నాలుగో టెస్ట్‌లో ఎట్టకేలకు విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఇచ్చిన 175 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ ఛేదించారు. 4 వికెట్ల తేడాతో ఇంగ్లీష్ ప్లేయర్లు విజయం సాధించారు. ఆస్ట్రేలియా ఇచ్చిన లక్ష్యాన్ని ఇంగ్లండ్ 32.2 ఓవర్లలో ఛేజ్ చేసింది.
ఇంగ్లండ్‌తో(England) ఓటమిపై ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరింత స్కోర్ చేసి ఉంటే.. మ్యాచ్ ఫలితం మారేదేమో అని ఆశాభావం వ్యక్తం చేశాడు. “మరిన్ని 50-60 పరుగులు చేసినా ఫలితం మారేదేమో. కానీ ఇంగ్లాండ్ ఈరోజు చాలా బాగా ఆడింది. మేము కూడా మరింత ప్రొయాక్టివ్‌గా ఆడాల్సిందేమో అనిపిస్తోంది. బ్రూక్‌లా ముందుకు వచ్చి షాట్లు ఆడే ధైర్యం ఆస్ట్రేలియా చూపలేదు’’ అని స్మిత్ అంగీకరించాడు.
Read Also: స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిన రేణుక.. శ్రీలంకకు చుక్కలు చూపించిందిగా..
Follow Us On: Youtube


