పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee)పై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి మనోజ్ అగర్వాల్(Manoj Agarwal)ను మమతా బెదిరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన వీడియో కావాలని కోరిందని సమాచారం. ఈ అంశంపై దర్యాప్తు స్టార్ట్ చేసిందని, అతి త్వరలోనే యాక్షన్ ప్లాన్ కూడా రెడీ అవుతుందని సన్నిహిత వర్గాల సమాచారం. ఈ విషయం సంచలనంగా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను, దాని అనువాద ప్రతిని అందించాలని సీఈఓ కార్యాలయానికి ఈసీ సూచనలు జారీ చేసింది.
అయితే హద్దులు దాటితే మనోజ్ అగర్వాల్‌పై ఉన్న అవినీతి ఆరోపణలను బయటపెడతానని మమతా బెనర్జీ ఇటీవల ఓ సమావేశంలో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అదే విధంగా రాష్ట్ర అధికారులను ఆయన బెదిరించారని కూడా మమతా ఆరోపించారు. 2011లో సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి.. ఓ సీఈవోపై దీదీ(Mamata Banerjee) ఈ స్థాయిలో ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి.
Read Also: తొక్కిసలాట బాధితులను కలవనున్న విజయ్..

