కలం, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక నిరసనలు (Anti India protests), నినాదాలు ఆగడం లేదు. ఈసారి ఇవి ఏకంగా ఢాకా యూనివర్సిటీలోకి అడుగుపెట్టాయి. అల్లరిమూకలు భారత వ్యతిరేక ఆందోళనలకు డాకా (Dhaka) విశ్వవిద్యాలయాన్ని కేంద్రంగా మార్చేశాయి. శుక్రవారం భారీ సంఖ్యలో ఆందోళనకారులు ఈ వర్సిటీలో ఆందోళనకు దిగారు. భారత వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ ఆందోళనలను ‘ఇంక్విలాబ్ మాంచో’ మద్దతుదారులు ముందుండి నడిపించారు. భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు ‘ఐ యామ్ హాది’ (నేను హాదీని) అని స్లోగన్స్ చేశారు. భారత్‌కు బద్ధ వ్యతిరేకి, ‘ఇంక్విలాబ్ మోంచో’ విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది హంతకులను త్వరగా పట్టుకొని, ఉరితీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హాది హంతకులు దేశాన్ని విడిచి పారిపోయారని, దీనికి భారత్ సాయం చేసిందంటూ మరికొందరు ఆందోళన చేశారు. కాగా, యూనివర్సిటీలో ‘మధుర్’ క్యాంటీన్‌ను కొందరు ఆందోళనకారులు ధ్వంసం చేశారు. బంగ్లా విమోచన పోరాటంలో మధుసూదన్ డే అనే హిందూ నేత ప్రాణాలర్పించారు. ఈ క్యాంటీన్ ఆయన స్థాపించిందే. దీనిపై కొందరు రాళ్లు రువ్వారు. క్యాంటీన్లోని కుర్చీలు, టేబుళ్లు విరగ్గొట్టారు. ‘క్యాంటీన్’ను బాయ్‌కాట్ చేయాలంటూ పిలుపునిచ్చారు. దీనిపై క్యాంటీన్ యజమానులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డగించారు.
Read Also: అతడి మరణానికి కెనడాదే బాధ్యత: భారత్
Follow Us On: X(Twitter)


