సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అక్టోబర్ 16న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ(Telangana Cabinet) సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం ఏర్పడిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించే అవకాశం ఉంది. 50 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లొచ్చన్న హైకోర్టు ఉత్తర్వులపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. దీనితో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులు, మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్ట్ టెండర్లపై క్యాబినెట్ నిర్ణయం తీసుకోనుంది.
కాగా, రిజర్వేషన్లు 50% దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు సూచించిన విషయం తెలిసిందే. గడువు తీరిన స్థానిక సంస్థలకు పాత విధానం ప్రకారం రిజర్వేషన్లు 50% దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని న్యాయస్థానం పేర్కొంది. పెంచిన 17% సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు జరపాలని స్పష్టం చేసింది. ప్రధానంగా ఈ విషయంపై క్యాబినెట్(Telangana Cabinet) చర్చలు జరపనుంది.
Read Also: వరంగల్‌లో పొంగులేటి పెత్తనం ఏంటి: కొండా

