కలం వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. వరుస సెలవులు రావడంతో తిరుపతి, యాదాద్రి, విజయవాడ, శ్రీశైలం, సింహాచలంలోని ఆలయాలకు భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. తిరుమల(Tirumala) భక్తులతో కిటకిటలాడుతోంది. అలిపిరి(Alipiri) చెక్‌పోస్టు వద్ద వాహనాలు స్తంభించిపోయాయి. తిరుమలలో అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దర్శనం కోసం శిలాతోరణం వరకు క్యూ నెలకొంది. టోకెన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి 24 గంటల సమయం పట్టనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు భూదేవి కాంప్లెక్స్ వద్ద దర్శన టికెట్ల కోసం భారీ క్యూ ఉంది. భక్తుల రద్దీ నేపథ్యంలో డిసెంబర్ 27, 28, 29 మూడు రోజుల పాటు శ్రీవాణి ఆఫ్‌లైన్ టికెట్లు రద్దు చేస్తున్నట్లు టీటీడీ(TTD) ప్రకటించింది. గురువారం ఒక్కరోజే 72,355 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి రూ.4.12 కోట్లు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Read Also: అయోధ్య నుంచి ద్వారక వరకు: సప్త మోక్ష నగరాల ఆధ్యాత్మిక ప్రాధాన్యం
Follow Us On: Sharechat


