కలం, మెదక్ బ్యూరో : మెదక్ జిల్లా నర్సాపూర్ (Narsapur) లోని బీవీఆర్ఐటీ (BVRIT) ఇంజనీరింగ్ కళాశాలలో తీవ్ర విషాదం నెలకొంది. కెమికల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న శంకర్ (19) అనే విద్యార్థి నర్సాపూర్లోని తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

