కలెక్టర్‌కే చెమటలు పట్టించిన బుడ్డోడు.. వీడియో వైరల్

కలం, వెబ్ డెస్క్: ఉత్తర ప్రదేశ్‌లోని (Uttar Pradesh) లఖీంపూర్ ఖేరీ జిల్లాలో వినూత్న ఘటన వెలుగుచూసింది. తమ ఇంటిని బంధువులు అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ 13 ఏళ్ల బాలుడు నేరుగా జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించాడు. అక్కడితో ఆగకుండా పక్కనే ఉన్న పోలీసులనుద్దేశించి మాట్లాడారు. ‘పోలీసులకు కమీషన్ ఇస్తేనే మా పని అవుతుందా?’ అని ప్రశ్నించాడు. చిన్న వయసులోనే ఆ బాలుడు చూపిన ధైర్యం అక్కడ ఉన్న అధికారుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. వెంటనే స్పందించిన కలెక్టర్ బాలుడి సమస్యను పరిష్కరించాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తూ బాలుడు మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. చిన్నతనంలోనే అన్యాయాన్ని ఎదిరించిన బాలుడి ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Read Also: రాహుల్ గాంధీపై మోదీ సెటైర్లు.. 56 ఏళ్ల యువకుడు అంటూ..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>