మోదీ ప్రజల విశ్వాసం కోల్పోయారు: ఖర్గే

కలం, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ (PM Modi) ప్రతిపక్ష పార్టీలను దూషించడమే పనిగా పెట్టుకున్నారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) పని చేశారు. ఆయన ప్రజల విశ్వాసం ఎప్పుడో కోల్పోయారని.. ముందు దాన్ని నిరూపించుకోవాలని సూచించారు. అసలు మోదీ దేశానికి ఏం చేశారని ప్రశ్నించారు. 56 ఇంచుల ఛాతీ ఎక్కడ ఉందని ఎద్దేవా చేశారు.

అయోధ్య విరాళాలను కొల్లగొట్టారు..

ప్రధాని మోదీ అన్ని రకాల నిబంధనలను పక్కన పెట్టి.. తన వాళ్లనే అయోధ్య రామమందిరం ట్రస్టులో (Ayodhya Trust) కూర్చోబెట్టారని ఖర్గే విమర్శించారు. కానీ, ఏం జరుగుతుందో చూస్తున్నామని.. గుడికి వచ్చిన విరాళాలను కొల్లగొట్టారని ధ్వజమెత్తారు. లక్షల మంది జీవితాలను నాశనం చేసిన నీట్ పరీక్ష రద్దుపై మోదీ ఇంతవరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. విద్యార్థుల జీవితాలను నాశనం చేసినందుకు ఎవరిదీ బాధ్యత.. అని విమర్శించారు.

లోపాలు కప్పిపుచ్చుకునేలా..

ప్రధాని మోదీ ఎంతసేపు తన లోపాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రయత్నిస్తుంటారని ఖర్గే (Mallikarjun Kharge) మండిపడ్డారు. ఎన్డీయే పాలన ముగిస్తేనే.. దేశంలో సంక్షేమం సాధ్యమవుతుందని.. అప్పటివరకు పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. ప్రతిపక్షాలపై మోదీ వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీయం కాదని.. భవిష్యత్తులో ఇలా మాట్లాడకుండా తనను తాను కట్టడి చేసుకోవాలని ఖర్గే సూచించారు.

Read Also: రాహుల్ గాంధీపై మోదీ సెటైర్లు.. 56 ఏళ్ల యువకుడు అంటూ..

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>