కలం, వెబ్ డెస్క్: కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క (Seethakka) మండిపడ్డారు. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్‌లోకి వస్తే మంచివాళ్లుగా, అదే పక్క పార్టీల్లోకి వెళ్తే లుచ్చాలుగా ఎలా మారుతారని ఆమె ప్రశ్నించారు. మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఆమె ఈ విమర్శలు చేశారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం ముఖ్య పదవుల్లో ఉన్న చాలామంది ఇతర పార్టీల నుంచి వలస వచ్చినవారేనని సీతక్క గుర్తుచేశారు. అలాంటప్పుడు ఆ పార్టీని ఏ రంగుతో పిలవాలని సెటైర్లు వేశారు. తమ పార్టీలోకి వస్తే పవిత్రులని భావించి, ఇతరుల దగ్గరికి వెళ్తే ఇలా విమర్శించడం ఏరకమైన సంస్కారమని సీతక్క కేటీఆర్‌ను నిలదీశారు.

