ఆర్ పేట సీఐ ఏసుబాబుపై దౌర్జన్యం చేసిందుకు గానూ మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) సహా 29 మందిపై చిలకలపూడి(Chilakalapudi) పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. వైసీపీ నేత సుబ్బన్నను విచారణ నిమిత్తం మచిలీపట్నం టౌన్ పీఎస్‌కు రావాల్సిందిగా పోలీసులు పిలిచారు. ఈ క్రమంలో పేర్ని నాని కూడా అక్కడకు వెళ్లారు. అనంతరం సీఐ విధులకు ఆయన ఆటంకం కలిగించడమే కాకుండా అక్కడ హల్‌చల్ సృష్టించారు. పోలీస్టేషన్ దగ్గర పేర్ని నాని వైఖరిని తీవ్రంగా పరిగణించిన ఏస్పీ.. ఆయనపై కేసు నమోదు చేశారు.
ఇటీవల.. పేర్ని నాని(Perni Nani) ఆధ్వర్యంలో వైసీపీ నేతలు మెడికల్ కాలేజీ దగ్గర నిరసన చేపట్టారు. కాలేజీలో పరీక్షలు జరుగుతున్నాయని, నిరసనలు, ఆందోళనలు చేయడానికి ఇది సరైన సమయం కాదని పోలీసులు చెప్పినా వారు వినలేదు. పైగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారి లాఠీలను లాక్కున్నారు. ఈ ఘటనలో దాదాపు 400 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారికి 41ఏ నోటీసులు జారీ చేశారు. వారిని విచారణకు రావాలని పిలిచారు. అయితే తాము చెప్పే వరకు ఎవరూ పోలీసుల దగ్గరకు వెళ్లొద్దని వైసీపీ నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్న.. సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. దీంతో అతనిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడకు చేరుకున్న పేర్ని నాని.. నేరుగా సీఐ గదిలోకి వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసులను అవహేళన చేస్తూ మాట్లాడారు. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also: ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఈసీకి తెలంగాణ హైకోర్టు కీలక సూచన

