బీపీఎల్ సీజన్-10 విజేతగా కడ్తాల్ జట్టు

కలం, నిర్మల్​ : సోన్ మండలం న్యూ బొప్పారం గ్రామంలో నిర్వహించిన బొప్పారం ప్రీమియర్ లీగ్ (BPL) సీజన్-10 క్రికెట్ టోర్నమెంట్‌కు ఆదివారం ఘనంగా తెరపడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో కడ్తాల్ జట్టు అద్భుత ఆటతీరుతో కూచన్‌పల్లి జట్టును ఓడించి విజేతగా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన కడ్తాల్ జట్టు నిర్ణీత 12 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది.

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన కూచన్‌పల్లి జట్టు కడ్తాల్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌ను ఎదుర్కోలేక 8 వికెట్లు కోల్పోయి 85 పరుగులకే పరిమితమైంది. దీంతో కడ్తాల్ జట్టు 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి బీపీఎల్ సీజన్-10 ట్రోఫీని సొంతం చేసుకుంది. మ్యాచ్ అనంతరం విజేత జట్టుకు ట్రోఫీతో పాటు నగదు బహుమతిని నిర్వాహకులు అందజేశారు.

ఈ టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సుధీర్ కు మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు లభించగా, బర్మ అరవింద్ బెస్ట్ బ్యాట్స్‌మన్, ప్రశాంత్ బెస్ట్ బౌలర్ గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి క్రీడలు, చదువుపై దృష్టి సారించేలా ఐపీఎల్ తరహాలో ప్రతి సంవత్సరం బీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>