జొన్న రొట్టె తినడమే మేలు: విప్ బీర్ల అయిలయ్య

కలం, యాదగిరిగుట్ట: జొన్నె రొట్టె తింటే ఆరోగ్యకరమైన ప్రయోజనాలుంటాయని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (Beerla Ilaiah) అన్నారు. ఆలేరు పట్టణంలో గిరిజన తండాల మహిళలు, చిరు వ్యాపారులు సంప్రదాయ పద్ధతిలో జొన్న రొట్టెలు తయారు చేసి, విక్రయిస్తుండటాన్ని స్వయంగా పరిశీలించారు.

వారి నుంచి జొన్న రొట్టెలను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా గిరిజన కుటుంబాల పరిస్థితులు, వ్యాపారం సాగుతున్న తీరు, ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

చిరు వ్యాపారులకు అండగా ఉంటాం..

సంప్రదాయ ఆహార పదార్థాలకు ప్రస్తుతం ఆదరణ పెరుగుతోందని విప్ బీర్ల అయిలయ్య అన్నారు. జొన్న రొట్టెలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను ప్రజలు మరింత ప్రోత్సహించాలని సూచించారు. గిరిజన మహిళలు స్వయం ఉపాధి ద్వారా కుటుంబాలను పోషించడం అభినందనీయమన్నారు.

బీర్ల అయిలయ్య, చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడం ద్వారా వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుందన్నారు. గిరిజనులు, పేద చిరు వ్యాపారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, తమకు అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>