epaper
Tuesday, November 18, 2025
epaper

‘కాంతార-1’ రికార్డ్.. ఆ క్లబ్‌లో చోటు..

రిషబ్ శెట్టి తీసిన ‘కాంతార-1(Kantara Chapter 1)’ అభిమానుల అంచనాలను మించి అదరగొడుతోంది. ఈ సినిమా చూసిన వాళ్లంతా కూడా బ్లాక్ బస్టర్ అన్నారు. థియేటర్లలో అయితే పూనకాలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమా రికార్డ్ సృష్టించింది. విడుదలైన 9 రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్‌లో స్థానం దక్కించుకుంది. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.509కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

ఈ కలెక్షన్లతో 2025లో అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో సినిమాగా ‘కాంతార-1’ నిలిచింది. ప్రస్తుతం థియేటర్లలో కొనసాగుతున్న ‘కాంతార-1(Kantara Chapter 1)’ మానియా ఇంతే ఇంకొన్ని రోజులు కంటిన్యూ అయితే అగ్రస్థానాన్ని కూడా సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా విక్కీ కౌశల్ నటించిన ‘ఛావా(Chhaava)’ ఉంది. ఈ సినిమా మొత్తం రూ.600 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.

Read Also: ఆ సీన్స్‌ను ఎంకరేజ్ చేసే మెచ్యూరిటీ రావాలి : జాన్వీ కపూర్

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>