కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర పోలీసులను డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) హెచ్చరించారు. సివిల్ వివాదాల్లో (Civil Disputes) తలదూర్చకూడదని అంతర్గత లేఖ ద్వారా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. సివిల్ వివాదాలు అయిన కుటుంబ సంబంధాలు, ఆస్తి విభజన, భూవి వివాదాల్లో పోలీసు అధికారులు లేదా సిబ్బంది జోక్యం చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపి స్పష్టం చేశారు.
పోలీసు స్టేషన్లను పంచాయితీ అడ్డాలుగా మార్చి సివిల్ తగాదాలు సెటిల్ మెంట్ చేస్తే హోం గార్డు నుంచి ఐపీఎస్ అధికారి వరకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సివిల్ తగాదాలు సివిల్ కోర్టుల పరిధిలోకి వస్తాయని ప్రతి పోలీసుకు తెలుసన్నారు. అయినా అలాంటి వివాదాల్లో కలగజేసుకుని సోలీసు స్టేషన్లను సెటిల్ మెంట్ సెంటర్లుగా మార్చడం తప్పని చెప్పారు. వీటికి సంబంధించిన కంప్లైంట్ లు వస్తే పార్టీలు లేదా పంచాయితీలకు మళ్లించాలని సూచించారు.
ప్రస్తుతం ఈ వివాదాలను పరిష్కరించిన స్టేషన్లు, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వేటు వేస్తామని డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరించారు. ఈ అంశ ఎస్పీలు, సీపీలు, హోం గార్డులు ఎవరికీ మినహాయింపులు లేవని స్పష్టం చేశారు. పోలీసు యూనిఫామ్, అవినీతి కలిసి ఉండకూడదన్నారు. అవినీతి, అక్రమాలపై కేసులు నమోదు చేసి కోర్టుల ముందు నిలబెట్టాల్సిన పోలీసులే అవినీతికి పాల్పడితే ప్రజల్లో నమ్మకం పోతుందన్నారు. పోలీసుల ప్రవర్తన యూనిఫామ్ గౌరవాన్ని, ప్రభుత్వానికి ప్రతిష్టను, శాంతిని కాపాడాలని డీజీపీ (DGP Shivadhar Reddy) కోరారు.
Read Also: ఫ్లై ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్ @ తెలంగాణ
Follow Us On: X(Twitter)


