కలం, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్లో పాస్టర్లకు గౌరవ వేతనం (Honorarium to Pastors) చెల్లిస్తామని ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారు. ఇటీవల సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం.. పాస్టర్లకు గౌరవ వేతనం ఈ నెల 24లోగా చెల్లిస్తామని మాటిచ్చారు. అన్నట్లుగానే నేడు నిధుల విడుదలకు ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో నిరుడు డిసెంబర్ నుంచి ఈ ఏడాది వరకు చెల్లించాల్సిన గౌరవ వేతనం నిధులు విడుదలయ్యాయి. ఒక్కో పాస్టర్కు నెలకు రూ.5వేల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8,148 మంది పాస్టర్లకు రూ.50కోట్ల 50లక్షల నిధులను బుధవారం ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో క్రిస్మస్ వేడుకలకు ప్రభుత్వం గౌరవ వేతనం రూపంలో కానుక ఇచ్చిందని పాస్టర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: ‘పోలవరం’ పనులను పరిశీలించిన పీపీఏ బృందం
Follow Us On: Youtube


