కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా పరిగణిస్తున్న పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) నిర్మాణ పనులను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) బృందం బుధవారం పరిశీలించింది. పీపీఏ సీఈఓ యోగేష్ పైతాన్కర్ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం ప్రాజెక్టు సైట్‌ను సందర్శించి, ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించింది.
ఈ సందర్భంగా బృందం ప్రధానంగా డయాఫ్రమ్ వాల్, గ్యాప్-1, గ్యాప్-2 ప్రాంతాల్లోని నిర్మాణ పనులను వివరంగా పరిశీలించింది. నిర్మాణ నాణ్యత, కార్యకలాపాలు, షెడ్యూల్ ప్రకారం పనులు జరుగుతున్నాయా అనే అంశాలపై దృష్టి సారించారు. జలవనరుల శాఖ అధికారులు, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రతినిధులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. వారు పోలవరం ప్రాజెక్టు సాంకేతిక వివరాలు, సమయపాలనలను బృందానికి వివరించారు.
Read Also: రెండోసారి పెళ్లి బంధంలోకి టెన్నిస్ స్టార్
Follow Us On: Youtube


