కలం, వెబ్ డెస్క్ : మరో రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆయన నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను, ప్రజలను ఇబ్బందులు పెడుతున్న వారి పేర్లు రాసిపెట్టుకోవాలని, తాము అధికారంలోకి వచ్చిన తరువాత వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలంటే కాంగ్రెస్ భయపడుతోందని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందని హరీశ్ రావు విమర్శించారు. సగం మందికి కూడా బతుకమ్మ చీరలు అందలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. కేసీఆర్(KCR) నాయకత్వంలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ కు త్వరలోనే బుద్ధి చెబుతారని, రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమాలు మరింత ఉధృతం అవుతాయని హరీష్ (Harish Rao) వెల్లడించారు.
Read Also: కాంగ్రెస్లో గ్రూప్ రాజకీయాలపై మంత్రి వివేక్ కీలక వ్యాఖ్యలు
Follow Us On: Sharechat


