కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు సీఎం విజయ్ గెలుపు తర్వాత పలువురు స్టార్ హీరోలు సైతం రాజకీయాల్లోకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతున్నారనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ హీరో ధనుష్ పొలిటికల్ ఎంట్రీకి సై అంటున్నారని వార్తలు అందిన వేళ మన టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సైతం రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నారనే చర్చ ప్రస్తుతం రాజకీయ, సినీ వర్గాల్లో సంచలనం రేపుతోంది.
అల్లు అర్జున్ (Allu Arjun) తన పొలిటికల్ ఎంట్రీపై అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. తన రాజకీయ రంగ ప్రవేశంపై ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్(PK)తో అల్లు అర్జున్ అంతర్గత సంప్రదింపులు జరిపారని నెట్టింట కథనాలు వెలువడుతున్నాయి. ఈ భారీ పొలిటికల్ ప్లాన్ వెనుక అల్లు అర్జున్ మామ, ప్రముఖ పారిశ్రామికవేత్త కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నుంచి లభిస్తున్న ప్రోత్సాహం, సహకారం ఎంతో కీలకంగా మారాయని తెలుస్తోంది. తన రాజకీయ అనుభవంతో అల్లుడిని ఒక పవర్ ఫుల్ లీడర్ గా ప్రొజెక్ట్ చేసేందుకు చంద్రశేఖర్ రెడ్డి తెరవెనుక చక్రం తిప్పుతున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు.
అయితే సోషల్ మీడియాలో సంచలనంగా మారిన ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ రూమర్స్ నిజం అయ్యి ఉంటే.. అల్లు అర్జున్ స్వయంగా పార్టీ పెట్టే ఆలోచనలోనే ఉన్నారా? వేరే పార్టీలోకి వెళ్లి పోటీ చేసే ఛాన్స్ ను పరిశీలిస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తారా? తెలంగాణలో చేస్తారా? అనే ప్రశ్నలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ అంశంపై త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
Read Also: కాజల్ వాటర్ మెలన్ తినదట.. రీజన్ ఇదే!
Follow Us On : WhatsApp

