కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) పెళ్లి తర్వాత మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చింది. లేటు వయసులో కూడా బంపర్ ఆఫర్లు దక్కించుకుంటూ యంగ్ హీరోయిన్స్‌కు గట్టి పోటీ ఇస్తోంది. తాజాగా కాజల్ ది ఇండియా స్టోరీ అనే సినిమాలో నటించింది. కల్తీ ఉత్పత్తుల నేపథ్యంలో సాగే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లలో కాజల్ పాల్గొంటోంది. ఇలా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ అగర్వాల్ ఆహార కల్తీ, తాను తిసుకునే ఆహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రాజెక్ట్ చేస్తున్న సమయంలో చాలా షాకింగ్ విషయాలు తెలుసుకున్నానని చెప్పింది.
ఈ కాలంలో బయట ఫుడ్ తినాలంటేనే భయంగా ఉందని పేర్కొంది. ఆహార కల్తీ బాగా పెరిగిపోయిందని, ఏ ఫుడ్ అయినా కల్తీ చేసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కల్తీ ఫుడ్ తినడం వల్లే క్యాన్సర్ కేసులు పెరిగిపోయాయని కాజల్ చెప్పింది. బయట దొరికే పాల ప్యాకెట్లలో అసలు పాలు ఎంత శాతం ఉంటున్నాయని ప్రశ్నించింది. ఇటీవల కాలంలో ముంబైలో వాటర్ మెలన్ ఇన్సిడెంట్‌తో ఓ కుటుంబం ప్రాణాలు కోల్పోయిన న్యూస్ చూసి తాను వాటర్ మెలన్ తినడమే మానేశానని చెప్పింది. వీలైనంత వరకు బయటి ఫుడ్ అవాయిడ్ చేయాలని సూచించింది.

