కలం వెబ్ డెస్క్ : గతేడాది అక్టోబర్ 26న జన్వాడ(Janwada)లో జరిగిన ఫామ్ హౌస్ పార్టీ(Farmhouse Party)కి సంబంధించిన కేసులో మోకిలా పోలీసులు తాజాగా చార్జిషీట్(chargesheet) దాఖలు చేశారు. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు చెందిన ఫామ్ హౌస్‌లో అనుమతి లేకుండా పార్టీ చేసుకోవడంతో పాటు అక్రమంగా విదేశీ మద్యం వినియోగించినట్లు పోలీసుల(Police) దర్యాప్తులో వెల్లడైంది. అదే సమయంలో పోలీసులు పార్టీలో పాల్గొన్న వ్యక్తులపై డ్రగ్ పరీక్షలు నిర్వహించారు. పార్టీలో పాల్గొన్న విజయ్ మద్దూరి అనే వ్యక్తికి డ్రగ్స్ పాజిటివ్ నిర్ధారణ అయింది. విజయ్ కొకైన్ తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంతో అతడిపై ఎన్డీపీఎస్ కేసు నమోదు చేశారు. అయితే విజయ్‌కి కొకైన్ సరఫరా చేసిందెవరన్నది ఇప్పటికీ తేలలేదు. తాజాగా చార్జిషీట్ దాఖలు చేసిన సందర్భంగా మొత్తం 35 మంది స్టేట్మెంట్లను పోలీసులు రికార్డ్ చేశారు. ఈ కేసు విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.
Read Also: చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్, ప్రధాన నిందితుడు అతడే!
Follow Us On: Instagram


