కలం, వెబ్ డెస్క్: బంగారం ధరలు(Gold Prices) రోజురోజుకూ పెరిగిపోతున్నాయే తప్ప తగ్గడం లేదు. బుధవారం రికార్డు స్థాయిలో బంగారం ధరలు పెరిగాయి. మార్కెట్ రేటు 10 గ్రాములకు రూ. 1.38 లక్షలు ఉంది. ఈ ఒక్క సంవత్సరంలో ధర 70 శాతం పెరిగింది. 1979 తర్వాత ఇంత భారీ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. అంతర్జాతీయ మార్కెట్‌లో సైతం గోల్డ్ రేట్ ఒక ఔన్సుకు 4,500 అమెరికన్ డాలర్లకు పెరిగింది.
వివిధ దేశాల మధ్య ఘర్షణలు, యుద్ధ వాతావరణంతో ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోళ్ళపై ఫోకస్ పెట్టాయి. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థను బ్యాలెన్సు చేసుకోడానికి కరెన్సీకి బదులుగా బంగారాన్ని నిల్వ చేసుకుంటున్నాయి. ఇండియాలో ఇదే పరిస్థితి కొనసాగితే ఫిబ్రవరి-మే నెలల మధ్యలో పెళ్ళిళ్ల సమయానికి బంగారం ధర(Gold Prices) ఏ స్థాయికి చేరుకుంటుందోననే సామాన్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
గత రెండురోజులుగా దేశవ్యాప్తంగా బంగారం (Gold) ధరలు భగ్గమంటున్నాయి. గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక ప్రకారం.. మున్ముందు బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టే వ్యాపారులు 70 శాతం మంది వచ్చే ఏడాది బంగారం ధరలు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగిపోతుండటంతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read Also: ఢిల్లీలో బంగ్లా హైకమిషన్‌కు భారత ప్రభుత్వ నోటీసులు
Follow Us On: Pinterest


