epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్, ప్రధాన నిందితుడు అతడే!

కలం, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన బస్సు ప్రమాద(Chevella Bus Accident) ఘటనలో దాదాపు 18 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎవరు నిందితులు అనేది? పోలీసులు తేల్చలేకపోయారు. అటు టిప్పర్ డ్రైవర్, ఇటు బస్సు డ్రైవర్‌పై విమర్శలొచ్చాయి. లోతుగా విచారణ జరిపిన పోలీసులు బుధవారం టిప్పర్ యజమానిని ప్రధాన నిందితుడిగా తేల్చారు. ఓవర్ లోడే ప్రమాదానికి కారణమని పోలీసుల నిర్ధరించారు. ఈ మేరకు టిప్పర్ యజమాని లచ్చు నాయక్ పేరును FIRలో చేర్చారు.

ఈ ఏడాది నవంబర్ 3న టిప్పర్- ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటన(Chevella Bus Accident) జరిగింది. దాదాపు 18 మృతి చెందారు. ప్రమాద సమయంలో ఓనర్ టిప్పర్‌లోనే (Tipper) ఉన్నాడు. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ మృతి చెందగా, ఓనర్ గాయాలతో బయటపడ్డాడు. మోతాదుకు మించిన కంక‌ర లోడ్‌తోపాటు ఓవ‌ర్ స్పీడ్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది.

Read Also: బతికుండగానే 12 లక్షలతో సమాధి నిర్మించుకున్న వ్యక్తి.. లైఫ్ ఫిలాసఫీ ఇదే

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>