కలం, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రేపు ముంబైకి వెళ్లనున్నారు. అక్కడ కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో ఆయనకు శస్త్ర చికిత్స జరుగనుంది. కొద్ది రోజులుగా పవన్ భుజాల సంబధిత సమస్యతో బాధపడుతున్నారు. పది రోజుల క్రితం ఆయన అంబానీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. రెండు భుజాల కండరాలు చిట్లినట్లు డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్ చేసుకోవాలని సూచించారు.
కానీ, ఆయన బిజీ షెడ్యూల్ వల్ల ఆపరేషన్‌కు కాస్త గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు డాక్టర్లు ఖచ్చితంగా చికిత్స చేయించుకోవాలని చెప్పడంతో పవన్ (Pawan Kalyan) ముంబై పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ ఆపరేషన్ తర్వాత కూడా సుమారు నాలుగు నెలల పాటు పవన్ విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది. పది రోజుల క్రితమే డాక్టర్లు ఆపరేషన్ చేయించుకోవాలని సూచించినా పవన్ పాలనా పరమైన కార్యక్రమాల వల్ల తన ఆపరేషన్‌ను వాయిదా వేశారు.
Read Also: క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్.. గంటలోనే నోటి క్యాన్సర్ టెస్ట్
Read Also: డిజిటల్ వారసులు

