Mobile Popup Ad
Mobile Popup Ad

కాలయాపన వద్దు.. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాల్సిందే!

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ బోధన్ PRTU భవన్ వద్ద నిజాం షుగర్స్ రక్షణ కమిటీ కన్వీనర్ ఉప్పునూతల రాఘవులు 8వ వర్థంతి సభ జరిగింది. ఈ కార్యక్రమానికి మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షులు గడ్డం గంగులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు వామపక్ష నాయకులు, NDSL కార్మిక నాయకులు రాఘవులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడారు. రాఘవులు నిజాం షుగర్ ఫ్యాక్టరీని (Nizam Sugar Factory) తెలంగాణ ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేశాడని, బోధన్ కేంద్రంగా ఉద్యమాలు నడపారని గుర్తుచేశారు. 2015 నుంచి 2019 వరకు అనేక ఆందోళనలు, ధర్నాలు, దీక్షలు నిర్వహించారని అన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫ్యాక్టరీ విషయంలో కాలయాపన చేసి మోసం చేసిందని, నేడు కాంగ్రెస్ కూడా అదేదారిలో నడుస్తుందని ఆరోపించారు. షుగర్ ఫ్యాక్టరీ మూత కారణంగా కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నేతలు శంకర్ గౌడ్, వరదయ్య ఏషాల గంగాధర్, దాల్ మల్క పోశెట్టి, ఫ్యాక్టరీ కార్మిక నాయకులు ఉపేందర్, శ్రీనివాస్‌, విద్యార్థి సంఘాల నాయకులు నాగరాజు, సంజయ్, మోసిన్, గైని రాములు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>