కలం, వెబ్ డెస్క్: క్యాన్సర్ రోగులకు ఇది గుడ్‌న్యూస్ లాంటిది. లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్సిటీ పరిశోధకుల నేతృత్వంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఓరల్ క్యాన్సర్‌ను (Oral Cancer) గుర్తించే నాన్-ఇన్వాసివ్ బ్రష్ టెస్ట్‌ను తయారుచేసింది. నోటిలోని పుండ్లు, గాయాల నుంచి కేవలం సాఫ్ట్ బ్రష్‌తో కణాలను సేకరించి, గంటలోనే పరీక్షిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సర్జికల్ బయాప్సీల వల్ల రోగులకు తీవ్ర నొప్పి, ఇన్ఫెక్షన్ ముప్పు ఉంది.
దీంతో పాటు చిగుళ్లు, ఎముకలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అయితే ఈ కొత్త బ్రష్ టెస్ట్ ద్వారా దాదాపు 90శాతంపైగా బయాప్సీలను నివారించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. 1,000 కంటే ఎక్కువ శాంపిల్స్‌పై జరిపిన ఈ అధ్యయనంలో ఓరల్ క్యాన్సర్‌ను ఖచ్చితంగా గుర్తించింది. అనవసర టెస్టులను నివారించింది.
పొగాకు, ధూమపానం, మద్యం సేవించడం, హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్ వంటి కారణాల వల్ల వచ్చే ఓరల్ క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తిస్తేనే ప్రాణాలను కాపాడవచ్చు. కానీ ప్రస్తుత విధానాలు చాలా ఆలస్యమవుతున్నాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్న రోగులకు పదే పదే సర్జరీలు చేయాల్సిన అవసరం లేకుండా ఈ టెస్ట్ ఉపయోగపడుతుంది. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) లాంటి సంస్థ ఇందులో భాగమైంది. తక్కువ ఖర్చుతో కూడిన ఈ పరీక్షను త్వరలోనే రోగులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

