Mobile Popup Ad
Mobile Popup Ad

రైలులో శోభనం డెకరేషన్.. టీటీఈపై వేటు

కలం, వెబ్ డెస్క్ : రైలులో ఫస్ట్ క్లాస్స్ ఏసీ కూపేను ప్రత్యేకంగా బుక్ చేసుకున్న ఓ యువ జంట.. దానిని  శోభనం గదిలా సిద్దం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. బల్లార్షా నుంచి ముంబై వెళ్తున్న నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్(Nandigram Express) రైలులోని ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇండియన్ రైల్వే(Indian Railways) నిబంధనలకు విరుద్ధంగా కోచ్‌లో అలంకరణలు ఏర్పాటు చేసిన ఘటనపై విచారణ చేపట్టి, విధులలో నిర్లక్ష్యం వహించిన టీటీఈని సస్పెండ్ (TTE Suspend) చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని, బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే ఆస్తులను వ్యక్తిగత కార్యక్రమాలకు వినియోగించడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు మరోసారి స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>