Mobile Popup Ad
Mobile Popup Ad

కాంట్రాక్టు విధానంపై భ‌గ్గుమ‌న్న కార్మికులు!

కలం, నిజామాబాద్ బ్యూరో: కాంటాక్ట్ విధానాన్ని రద్దుచేసి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి (Kamareddy Govt Hospital) ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దశరథ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింద‌ని గుర్తు చేశారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం త‌మ‌కు రూ.15,600 వేత‌నం ఇస్తున్న‌ద‌ని తెలిపారు. కానీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ పోగా రూ.11,000 వేలు మాత్ర‌మే ఖాతాలో వ‌స్తున్నాయ‌ని చెప్పారు. ఇప్పటికైనా కార్పొరేషన్ ద్వారా వేతనాలు ఇవ్వాల‌ని, కాంట్రాక్టు విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఆస్పత్రుల్లో పని చేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ కార్మికుల‌కు సంబంధించిన వేతనాల సవరణ ఒప్పంద కాల పరిమితి ముగిసి ఏడాది అవుతుంద‌ని తెలిపారు. ఇప్పటి వరకు వేతనాలు పెంచకపోవడం అన్యాయమని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎన్నికలకు ముందు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామ‌ని కాంగ్రెస్ ప్ర‌క‌టించింద‌న్నారు. పీఆర్సీ ప్రకటించి కనీస వేతనాలు కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చిన‌ట్లు గుర్తు చేశారు. సుప్రీం కోర్టు జీవో ప్రకారం రూ.26,000 వేతనం ఇవ్వాలని కోరారు.

దీంతో పాటు సంవత్సరానికి 23 జాతీయ పండుగ‌ల‌కు సెలవులు ఇవ్వాలన్నారు. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని కార్మికులకు వెంటనే వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దశరథ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పి బాలరాజ్. ఏఐటీయూసీ జిల్లా నాయకులు ప్రవీణ్ నరేష్, ఆస్పత్రి కార్మికులు శ్రీనివాస్. ఎండీ రఫీక్. పాజియా, ఫాతిమా, బైరమ్మ, లక్ష్మీ, మమత, శ్యామల, బాలు, పర్వీన్ బేగం, సతీష్, నర్సింలు, దశరథ్, అజయ్, సందీప్, మహేందర్, సంతోష్, రజిత, మల్లేష్, రాజ్యలక్ష్మి, లక్ష్మణ్, భాగ్యమ్మ, బాలరాజ్, గౌతమ్ సంజు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>