Mobile Popup Ad
Mobile Popup Ad

రవితేజ-శ్రీవిష్ణు మల్టీస్టారర్‌కు అదిరిపోయే టైటిల్?

కలం, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ, కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీవిష్ణు కాంబినేషన్‌లో (Ravi Teja–Sree Vishnu) ఓ క్రేజీ మూవీ తెరక్కనున్నట్లు ఇటీవల న్యూస్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ క్రేజీ మల్టీస్టారర్‌కు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. హషిత్ గోలి (Hasith Goli) దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాకు ‘వీరాధి వీరులంట’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ ఆగష్టులో  ప్రారంభం కానుందని తెలుస్తోంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్‌పై దిల్ రాజు (Dil Raju) నిర్మిస్తున్న ఈ సినిమా 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం. రవితేజ, శ్రీవిష్ణు కలిసి నటించనున్న ఈ మల్టీస్టారర్‌పై ఇప్పటికే సినీ అభిమానులలో ఆసక్తి నెలకొంది. చిత్రానికి సంబంధించిన అధికారిక వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>