epaper
Friday, January 16, 2026
spot_img
epaper

ఫోటో తీయండి.. ప్రైజ్​ మనీ పొందండి

కలం, వెబ్​ డెస్క్​ : హైదరాబాద్​, రంగారెడ్డి జిల్లాల్లో దాగి ఉన్న పర్యాటక అందాలను ఫోటోలు, వీడియోల రూపంలో పరిచయం చేసిన వారికి తెలంగాణ టూరిజం (Telangana Tourism) శాఖ భారీ నగదు బహుమతులు అందించనుంది. ఈ మేరకు పర్యాటక శాఖ ప్రకటన జారీ చేసింది. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, కుటుంబాలు వారాంతాల్లో వెళ్లేందుకు కొత్త ప్రదేశాలను అన్వేషిస్తుంటారని, ఈ నేపథ్యంలో 100 వీకెండ్​ వండర్స్​ ఆఫ్​ తెలంగాణ పేరుతో పోటీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలకు పెద్దగా తెలియని జలపాతాలు, పురాతన దేవాలయాలు, ట్రెక్కింగ్​ పాయింట్లు వంటి 100 కొత్త ప్రదేశాలను గుర్తించి, వాటి వివరాలతో ఒక కాఫీ టేబుల్​ బుక్​ రూపొందించడమే ఈ కాంపిటేషన్​ లక్ష్యమని తెలిపారు.

నేచర్​, వైల్డ్​ లైఫ్​, ఆర్ట్​ అండ్ కల్చర్​, హెరిటేజ్​, వాటర్​ బాడీస్​, వంటకాలు, ఫామ్​ స్టేస్​, రిసార్ట్స్​, స్పిరిచువల్​, అడ్వెంచర్​ వంటి 10 విభాగాల్లో ఎంట్రీలు పంపవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఎంచుకున్న ప్రదేశానికి సంబంధించి 3 మంచి ఫోటోలు, 60 సెకన్ల వీడియో, ఆ ప్రదేశానికి రవాణా, బస, బడ్జెట్​ వివరాలతో కూడిన వంద పదాల సమాచారాన్ని పోస్టర్లో పేర్కొన్న గూగుల్​ ఫామ్​ లేదా సోషల్​ మీడియా అకౌంట్లలో ట్యాగ్​ చేయొచ్చని తెలిపారు.

ఈ పోటీల్లో ఉత్తమ ఎంట్రీలకు మొదటి బహుమతిగా రూ.50 వేలు, సెకండ్​ ప్రైజ్​ రూ.30 వేలు, థర్డ్​ ప్రైజ్​ కింద రూ.20 అందించనున్నట్లు వివరించారు. అలాగే, కన్సోలేషన్​ బహుమతులుగా హరిత హోటల్స్​ లో ఉచిత బస కల్పిస్తామని వెల్లడించారు. ఆసక్తి ఉన్న వారు జనవరి 5వ తేదీలోపు ఎంట్రీలు పంపించాలని Telangana Tourism అధికారులు కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>