కలం, వెబ్ డెస్క్: చిన్నారి జాహ్నవి మిస్సింగ్ (Jahnavi Missing Case) కేసులో పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఈ అపహరణకు ఒడిగట్టిన వారు తమ తప్పును ఒప్పుకుని, భయం లేకుండా చిన్నారి సమాచారాన్ని అందిస్తే వారిపై ఎలాంటి కేసు నమోదు చేయబోమని డీఎస్పీ తిలక్ స్పష్టం చేశారు. నిందితులు నిర్భయంగా ముందుకు వస్తే, పాపను సురక్షితంగా తన తల్లి ఒడికి చేరుస్తామని హామీ ఇచ్చారు. కాగా, సెల్‌ఫోన్లు వాడని వ్యక్తులే ఈ కిడ్నాప్‌కు పాల్పడి ఉంటారని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే చిన్నారిని ఎత్తుకెళ్లిన కోణంలో దర్యాప్తును వేగవంతం చేశామన్నారు. పాప ఆచూకీ కోసం గాలిస్తున్నామని డీఎస్పీ వెల్లడించారు.

