Mobile Popup Ad
Mobile Popup Ad

స్వార్థ ప్రయోజనాల కోసమే కాళేశ్వరం నిర్మాణం: పెద్దపల్లి ఎమ్మెల్యే

కలం, కరీంనగర్ బ్యూరో: గత నాలుగు రోజులుగా బిఆర్ఎస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టుపై రైతులకు ప్రజలకు విష ప్రచారాన్ని చేరవేస్తున్నారని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు (MLA Vijaya Ramana Rao) మండిపడ్డారు.పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్ లో స్థానిక కాంగ్రెస్ నాయకులతో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైతన్నకు అవసరమైన నీరు అందించేందుకు పైపుల ద్వారా ఎత్తిపోసే అవసరం లేకుండానే తుమ్మడిహట్టిని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తుమ్మిడిహట్టి నుండి ఎల్లంపల్లికి నీరును తీసుకువచ్చే విధంగా రూపకల్పన చేపట్టారని తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక లక్ష కోట్ల రూపాయలతో ప్రజా ధనాన్ని వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారని దుయ్యబట్టారు. తమ స్వార్ధ ప్రయోజనాల కోసం, వారి కుటుంబ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ నేతలు నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా నీళ్లను కింది నుండి పైకి ఎత్తిపోసే ప్రాజెక్ట్ కేసీఆర్ ఇంజనీర్ అవతారం ఎత్తి నిర్మించారని ఎద్దేవా చేశారు. ఆ ప్రాజెక్టు నాలుగు నుండి ఐదు సంవత్సరాల కాలంలో ఒక సంవత్సరానికి 180 టీఎంసీల చొప్పున నీళ్ళు ఎత్తి పోసారని అబదప్పు మాటలు చెప్పి పబ్బం గడిపారని అన్నారు.

అలా అయితే ఐదు సంవత్సరాల కాలంలో 900 టీఎంసీల నీరును పోయాల్సి ఉండగా.. 74.5 టీఎంసీల నీళ్లను మూడు ప్రాంతాలు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల లిఫ్ట్ ల ద్వారా ఎల్లంపల్లికి పంపిణీ చేసి ఎల్లంపల్లిలో ఉన్న 40 టీఎంసీల నీరును కలుపుకొని కేవలం 114 టీఎంసీల నీళ్లను ఐదు సంవత్సరాలలో ఎత్తిపోశారని విమర్శించారు. కాలేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ మానస పుత్రిక అని, ప్రపంచంలో ఎనిమిదో వింత అని సొంత బస్సులలో రైతులను, ప్రజలను తరలించి టూరిజం ప్రాజెక్టుగా చూపించారని ఎద్దేవా చేశారు.

ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి వరద కాలువలతో నీళ్లు..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి వరద కాలువల ద్వారా ఈ రాష్ట్ర రైతాంగానికి కాళేశ్వరంతో సంబంధం లేకుండా గతంలో ఎన్నడు లేని విధంగా 83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతంగం పండించేందుకు నీరును అందించడం జరిగిందన్నారు. పీవీ నరసింహా రావు దేశ ప్రధానిగా ఉన్న సమయంలో రూ.200 కోట్లతో వరద కాలువలకు శంకుస్థాపన చేపట్టారని గుర్తు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వరద కాలువలను పూర్తి చేసి ఎస్సారెస్పీ ద్వారా రెండు డ్యాములు నింపారని తెలిపారు.

తుమ్మిడి ఎట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణానికి వైయస్ రాజశేఖర్ రెడ్డి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఐదున్నర కోట్ల రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టి వరద కాలువల నిర్మాణం చేపట్టిందని.. 182 కిలోమీటర్ల పైన కాలువల నిర్మాణం పూర్తయిందని వివరించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు లేఖ ఇచ్చారని వివరించారు.

ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్ని నాగార్జునసాగర్, పులిచింతల, హుస్సేన్ సాగర్, శ్రీశైలం, ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, మిడ్ మానేరు లోయర్ మానేరు ఏకశిలా, ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణమయ్యాయని.. ఇప్పటివరకు చెక్కుచెదరకుండా ఉన్నాయని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో తమ ప్రాంతాల నుండి నీళ్లు తీసుకుపోయి మీరు.. ఈ ప్రాంతంలో వాడుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. పెద్దపల్లి టేలెంట్ ప్రాంతం పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో ఎండిపోయిందని ఎద్దేవా చేశారు.

అబద్దాలను ప్రజలకు చెప్పడం మానేసి అవసరమైన సలహాలు సూచనలు అందించాలే తప్ప మోసపు మాటలు చెప్పడం మానుకోవాలని అన్నారు. హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతం సశ్యామలమవుతుందని అబద్ధపు మాటలు చెప్పారే తప్పా ఈ ప్రాంతానికి నీరు అందించిన దాఖలాలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు, పట్టణ కౌన్సిలర్లు, పలు గ్రామాల సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>