Mobile Popup Ad
Mobile Popup Ad

కేసీఆర్ ఇంజినీర్ కాదు: సీఎం రేవంత్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్: మేడిగడ్డ వద్ద ప్రాజెక్ట్ కట్టొద్దని 2015లో రిటైర్డ్ ఇంజినీర్లు చాలా స్పష్టంగా చెప్పినా.. కేసీఆర్ పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. తనకు నచ్చినట్లుగా వ్యాప్కోస్ సంస్థతో సర్వే చేయించుకుని, రిపోర్టులు తెప్పించుకుని కాళేశ్వరం డిజైన్ చేశారన్నారు. తానే స్వయంగా మేధోశక్తిని రంగరించి కాళేశ్వరం కట్టించానని కేసీఆర్ చెప్పారని, ఆయన ఇంజినీర్ ఎంతమాత్రం కాదని మండిపడ్డారు. అబద్ధాలు చెప్పడంలో కల్వకుంట్ల కుటుంబానికి మొదటి ర్యాంకే వస్తుందన్నారు.

11 నెలలకే లోపాలు..

కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రాజెక్ట్ ప్రారంభించిన 11 నెలలకే ఈఈగా పనిచేస్తున్న బి.వి.రమణారెడ్డి లోపాలు గుర్తించి, ఎల్అండ్‌టీకి లేఖ రాశారన్నారు. రిపేర్ చేయాలని కోరినా ఆ సంస్థ పట్టించుకోలేదని.. అది కాస్తా చివరికి కూలిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రాజెక్ట్ కట్టిన ఏడాదిలోనే లోపాలు బయటకు వచ్చాయని.. అప్పటి ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదన్నారు.

మేడిగడ్డ కరెక్ట్ కాదని చెప్పారు..

2020లో బ్యారేజీలో సమస్యలు వచ్చాయని, 2022లో కన్నెపల్లి పంప్‌హౌస్‌లో గోడ కూలిపోయి, మోటార్లు మునిగిపోయాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రాజెక్ట్ కట్టినప్పటి నుంచి లోపాలు వెలుగు చూస్తూనే ఉన్నాయని గుర్తు చేశారు. మేడిగడ్డ వద్ద ప్రాజెక్ట్ నిర్మించడం సాంకేతికంగా సరికాదని నిపుణులు చెప్పారన్నారు. ధవళేశ్వరం కట్టిన సర్ ఆర్థర్ కాటన్ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఆ కాలంలోనే ఇచ్ఛంపల్లి వరకు సర్వే చేశారని గుర్తు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>