కలం, మహబూబ్ నగర్ బ్యూరో : మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushboo Gupta) బోయపల్లి ప్రాథమిక పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదుల్లోకి వెళ్ళి బోధన కార్యక్రమాలను పరిశీలించి విద్యార్థులను చదివించారు. విద్యార్థుల ప్రతిభా సామర్థ్యాలను పరిశీలించారు. పూర్వ ప్రాథమిక పాఠశాల పనితీరును ప్రత్యేకంగా పరిశీలించారు. అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్న బోయపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయ బృందాన్ని కలెక్టర అభినందించారు. కలెక్టర్ వెంట ఎంఈవో లక్ష్మణ్ సింగ్, హెచ్ఎం హరినాథ్, ఇతర అధికారులు ఉన్నారు.
Read Also: గంటల తరబడి కుర్చీలో కూర్చుంటున్నారా? ఆరోగ్యానికి జరిగే ప్రమాదాలు ఇవే!
Follow Us On: X(Twitter)

