కలం, వెబ్ డెస్క్ : హిందువులు అత్యంత పవిత్రంగా భావించే దేవాలయాల ప్రాంగణంలో కొందరు ఆకతాయిలు చేస్తున్న వికృత చేష్టలు భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా ఆదోని (Adoni ) పరిధిలోని వీరపావురం ప్రాంతంలో ఓ యువకుడు చేసిన అపచారం నెట్టింట తీవ్ర దూమారం రేపుతోంది. వీరపావురం ప్రాంతానికి చెందిన వడ్డే ఈరన్న స్థానిక శివాలయం వద్ద ఉన్న పవిత్ర దీపం నుంచి సిగరేట్ వెలిగించి అసభ్యకరంగా ప్రవర్తించాడు.
ఈ దారుణ ఉందంతం జరుగుతున్న సమయంలో ఈ అపచారాన్ని అడ్డుకోవాల్సిన అతని స్నేహితులు దానిని సరాదాగా భావించి ఆ దృశ్యాలను తమ మొబైల్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో కాస్త క్షణాల్లోనే నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోను చూసిన శివ భక్తులు, హిందూ సంఘాల నాయకులు, పలువురు నెటిజన్లు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. సదరు వ్యక్తితో పాటు అతనికి సహకరించిన స్నేహితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి అనిత అధికారిక ట్విట్టర్ ఖాతాను ట్యాగ్ చేస్తూ భక్తుల మనోభావాలకు సంబంధించిన ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని అంటున్నారు. వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతున్నారు.
Read Also: ఎముకలు ఎందుకు బలహీనపడతాయి? ప్రధాన కారణాలు ఇవే
Follow Us On : WhatsApp

