కలం, మునగాల : సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ (SP Narasimha) మంగళవారం ఉదయం మునగాల (Munagala) పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులు, కేసుల వివరాలు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. విధి నిర్వహణలో సిబ్బంది పాటించాల్సిన విధానాలపై పలు సూచనలు చేశారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడికి నమ్మకం, భరోసా కలిగేలా పోలీసులు వ్యవహరించాలని ఎస్పీ ఆదేశించారు. రిసెప్షన్ సెంటర్ నిర్వహణను పరిశీలించిన ఆయన, ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, హైవే పెట్రోలింగ్‌ను నిరంతరం కొనసాగిస్తూ ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ (SP Narasimha) స్పష్టం చేశారు.
చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై నిఘా కొనసాగించాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలు, వివిధ కేసులలో స్వాధీనం చేసుకున్న వాహనాలను ఎస్పీ పరిశీలించారు. రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలని, సమస్యాత్మక వ్యక్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, ఏఎస్ఐ రత్నం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Also: పెట్టుబడులు ఓకే.. కానీ : ఐటీ సంస్థలకు భట్టి కండిషన్స్!
Follow Us On : WhatsApp

