Mobile Popup Ad
Mobile Popup Ad

తిరుమల అలిపిరి డిపోలో డ్రైవర్ల నిరసన.. ఆ నిబంధనే కారణమా!

కలం, వెబ్ డెస్క్: తిరుమల అలిపిరి డిపో (Tirumala Alipiri Depot) పరిధిలో ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల డ్రైవర్లు ఆందోళన (Bus Drivers Protest) చేపట్టారు. అలిపిరి డిపో యాజమాన్యం ఎలక్ట్రిక్ ఏసీ బస్తుల డ్రైవర్లకు ప్రతి డ్యూటీలో కచ్చితంగా 5 ట్రిప్పులు వేయాలనే కఠినమైన నిబంధనను విధించింది. అంతే కాకుండా 5 ట్రిప్పులు వేయకపోతే పూర్తి జీతం కాకుండా ట్రిప్పుల వారీగానే జీతం చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఈ నిబంధనపై డ్రైవర్లు మండిపడుతున్నారు.

యాజమాన్యం నిర్దేశించిన 5 ట్రిప్పుల టార్గెట్ ను పూర్తిచేయడం అసాధ్యమని వారు వాపోతున్నారు. బస్సుల కండిషన్, బ్యాటరీ ఛార్జింగ్ సమస్యల వల్ల 3 నుంచి 4 ట్రిప్పుల కంటే ఎక్కువ వేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 ట్రిప్పులు వేయకుంటే ట్రిప్పుల వారీగానే జీతం ఇస్తామనే యాజయాన్యం నిర్ణయం అన్యాయమని మండిపడుతున్నారు.

Read Also: నేడు, రేపు కడప జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>