ఎస్‌ఐఆర్ ఫారాల భర్తీని పరిశీలించిన తహసీల్దార్, సర్పంచ్

కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లాలోని సోన్ (Soan)  మండలం కడ్తాల్ గ్రామపంచాయతీలో భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ (Voter Enumeration )ఫారాల భర్తీ ప్రక్రియను తహసీల్దార్ సంతోష్, గ్రామ సర్పంచ్ గుర్రం రాము మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2002 ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు అప్పట్లో నమోదైన పేరు, తల్లిదండ్రుల లేదా భర్త పేరు, చిరునామా, కుటుంబ వివరాలు, ఓటరు నమోదు సంఖ్య తదితర వివరాలను పరిశీలించి, వాటికి అనుగుణంగా ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేయాలని సూచించారు.

అలాగే ప్రతి అర్హుడు ఫారాన్ని సక్రమంగా నింపి ఎన్నికల సిబ్బందికి అందజేసి, ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి సుమయా తస్కిన్, జీపీఓ గంగాధర్, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Read Also: పెట్టుబడులు ఓకే.. కానీ : ఐటీ సంస్థలకు భట్టి కండిషన్స్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>