కలం, వెబ్ డెస్క్: గ్రామ పంచాయతీల చెక్ పవర్(Cheque Powers)కు సంబంధించి గందరగోళం నెలకొన్నది. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన జీవోతో ఈ కన్ఫ్యూజన్ నెలకొన్నది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చిన జీవోలో సర్పంచ్(Sarpanch), స్పెషల్ ఆఫీసర్, ఎంపీలకు మాత్రమే చెక్ అప్రూవల్ పవర్ ఇచ్చింది. అయితే రెండో సంతకం విషయంలో గందరగోళం నెలకొన్నది. గతంలో ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ ఉండేది. ప్రభుత్వ జీవోలో ఉప సర్పంచ్ ప్రస్తావన లేకపోవడంతో ఉప సర్పంచ్ కు చెక్ పవర్(Cheque Powers) ఉండదన్న ప్రచారం జరుగుతోంది. అయితే రెండో సంతకం విషయంలో క్లారిటీ లేదు. కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా కొనసాగుతుండగా.. ఉప సర్పంచ్ లుగా బీఆర్ఎస్ మద్దతుదారులు ఉన్నారు. ఇలా చోట్ల వివాదం చెలరేగే అవకాశం ఉంది. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో కాసేపట్లో ఇందుకు సంబంధించిన అంశాన్ని సవరించి మరో జీవో ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.
Read Also: ట్రిపుల్‌ఆర్ అలైన్‌మెంట్ మార్చండి: కవిత
Follow Us On: X(Twitter)


