Mobile Popup Ad
Mobile Popup Ad

నిన్న బాధ్యతల స్వీకరణ.. నేడు రిటైర్మెంట్!

కలం, వెబ్ డెస్క్ : ఏపీలో సీనియర్ ఐఏఎస్ అధికారి వై. శ్రీలక్ష్మి (IAS Srilakshmi) విచిత్ర పరిస్థితిలో రిటైర్మెంట్ అయ్యారు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత తిరిగి విధుల్లో చేరిన ఆమె జూన్ 29న సాధారణ పరిపాలన శాఖలోని జీపీఎం అండ్ ఏఆర్ విభాగంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే జూన్ 30న ( నేడు) రిటైర్మెంట్ అయ్యారు.

ఉమ్మడి ఏపీలో ఐపీఎస్ అధికారిగా చేరిన శ్రీలక్ష్మి (IAS Srilakshmi) సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. దివంగత వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో మైనింగ్ శాఖకు కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆ సమయంలో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో శ్రీలక్ష్మి నిబంధనలకు విరుద్ధంగా గాలి జనార్దన్ రెడ్డికి అనుకూలంగా జీవోలు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆమెను ఐఏఎస్ సర్వీసు నుండి సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

తెలుగు రాష్ట్రాల విభజన అనంతరం ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ క్యాడర్ లో ఉన్న తనను ఏపీకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని శ్రీలక్ష్మి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. జగన్ సీఎంగా ఉన్న కాలంలో ఆమె పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు పోస్టింగ్ ఇవ్వలేదు. కానీ రిటైర్మెంట్ అవుతారనుకున్న నాలుగు రోజుల్లో పోస్టింగ్ ఇచ్చింది. జూన్ 25న ఆమెకు పోస్టింగ్ ఇవ్వగా.. జూన్ 29న బాధ్యతలు చేపట్టారు.

జూన్ 30 (నేడు)న ఆమె పదవీ విరమణ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ, సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన ఆమెను కూటమి ప్రభుత్వం అధికారికంగా రిలీవ్ చేసింది. శ్రీలక్ష్మి స్థానంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శంషేర్‌సింగ్‌ రావత్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also: ఫ్యాన్స్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్లే పవన్ కళ్యాణ్​కు అనారోగ్యం!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>