Mobile Popup Ad
Mobile Popup Ad

గుడ్ న్యూస్.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రైతులకు శుభవార్త. ఖరీఫ్ సీజన్‌ రైతుభరోసా (Rythu Bharosa) నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికగా జరుగుతున్న సభలో ఫస్ట్ ఫేజ్ కింద రూ. 2,482.02 కోట్లను సీఎం రిలీజ్ చేశారు. ఈ మేరకు తొలి విడతలో 44.28 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి.

ఈ సందర్భంగా 2 ఎకరాల్లోపు ఉన్న రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ. 6,000 చొప్పున నిధులు జమ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అర్హులైన రైతులందరికీ దశలవారీగా ఈ పెట్టుబడి సాయం అందిస్తామని స్పష్టం చేశారు. అయితే రైతు భరోసా ఆర్థిక సాయం కోసం కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు తమ వివరాలను సమీప వ్యవసాయ విస్తరణ అధికారికి (AEO) జూలై 5వ తేదీలోపు అందజేస్తే ఈ పథకానికి అర్హులు అవుతారు.

కాగా, రైతుభరోసా నిధులను విడుదల చేసే కార్యక్రమాన్ని తొలుత ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలోని చింతకానిలో ‘రైతు ఆశీర్వాద సభ’ పేరుతో నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. దానికి తగిన ఏర్పాట్లు కూడా జరిగాయి. కానీ భారీ వర్షంతో అక్కడ సభ నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సభను చివరకు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికకు షిప్ట్ చేశారు.

Read Also: వర్షపు జల్లుల్లో జలపాతాల జోరు.. తెలంగాణలో టాప్ వాటర్‌ఫాల్స్ ఇవే!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>