Mobile Popup Ad
Mobile Popup Ad

కరీంనగర్ క్రిటికల్‌కేర్ ఆస్పత్రి ఎదుట ఏఐవైఎఫ్ నిరసన

కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar) ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కేవలం పేరుకే పెద్ద క్రిటికల్ కేర్ ఆసుపత్రి అన్నట్లు ఉందని ఏఐవైఎఫ్ (AIYF) రాష్ట్ర సహాయ కార్యదర్శి భావండ్లపల్లి యుగంధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అఘమేఘాల మీద నిర్మించిన క్రిటికల్ కేర్ భవనం రోగుల సౌకర్యాల కోసమా లేక కాంట్రాక్టర్ల ఉపాధి బిల్లుల కోసమా అని రేవంత్ సర్కారుపై ధ్వజమెత్తారు.

క్రిటికల్ కేర్ ఆస్పత్రి ముందు ఏఐవైఎఫ్ (AIYF) కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేశారు. అనంతరం యుగంధర్ మాట్లాడుతూ.. క్రిటికల్ కేర్ అంటే అత్యవసర వైద్యం కోసం అన్ని రకాల పరికరాలు, వైద్య బృందం, సిబ్బంది ఏర్పాటు చేయాల్సి ఉండగా కనీస సౌకర్యాలు లేక రోగులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

క్రిటికల్ కేర్‌లో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, అత్యవసర వైద్యం కోసం పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్య బృందం, తగిన సిబ్బందిని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. రోగులకు అత్యవసరమైతే ఎంజీఎమ్ వరంగల్ జిల్లా కేంద్రానికి లేదా హైదరాబాద్ ఎయిమ్స్, నిమ్స్ కి పంపిస్తున్నారన్నారని వాపోయారు. ఆసుపత్రిలో సరైన అర్హత, అనుభవం గల వ్యక్తిని సూపరింటెండెంట్‌గా నియమించాలని డిమాండ్ చేశారు.

ఆసుపత్రిలో కాంట్రాక్టర్ అరాచకాలు శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ విభాగాలను కాంట్రాక్ట్ సంస్థకు అప్పగించారని, సంబంధిత కాంట్రాక్టర్ సెక్యూరిటీలను ఇతరత్రా సిబ్బందులను కాంట్రాక్టర్ మానసికంగా రూడ్ గా ప్రవర్తిస్తూన్నారని, తోటి సిబ్బందిని మానసికంగా వేధిస్తూ ఉద్యోగాల నుండి తొలగిస్తూ రాక్షసానందం పొందుతున్నాడని ఆయన ఆరోపించారు.

ఇలాంటి వారిని ప్రోత్సహిస్తున్న సదరు కాంట్రాక్టర్‌ అరాచకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అవసరమైతే కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇంత పెద్ద ఆసుపత్రిలో ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, ఆవరణలో ఆర్వో వాటర్ ప్లాంట్, ఏ.టి.ఎం సెంటర్ ఏర్పాటు చేయాలని, ఉచిత డెడ్ బాడీ వాహనాలు, నూతన ఫ్రీజర్లు ఏర్పాటు చేయాలన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిపై స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ గారు‌ ప్రత్యేక దృష్టి పెట్టాలని యుగంధర్ దృష్టి సారించి కనీస సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో నగర కార్యదర్శి చెంచల మురళి, మాడిశెట్టి అరవింద్, ఆడెపు శ్రీనివాస్, రాజు, నరహరి ప్రేమలత, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Read Also: యాదగిరిగుట్ట గెస్ట్ హౌస్‌లకు ‘తిరుమల’ మోడల్.. సీఎం రేవంత్​

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>