కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) పరేడ్ గ్రౌండ్స్ లో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగిస్తూ జిల్లాలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు. నిజామాబాద్ జిల్లాలో రైతు భరోసా, మహలక్ష్మి, గృహ జ్యోతి, చేయూత పథకం, రైతు రుణ మాఫీ, ఇందిరమ్మ ఇండ్ల పథకం సజావుగా జరుగుతున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నానని ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.
సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలులో నిజామాబాద్ జిల్లా ముందంజలో పయనిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తోందని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన జిల్లాలో వివిధ రంగాలలో సాధించిన ప్రగతిని వివరించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ పథకాల శకటాలు ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా భూపతి రెడ్డి వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య జేసీ భుజంగరావు పాల్గొన్నారు.

